'రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడడానికి చర్యలు చేపట్టాలి'
BHNG: రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలను కాపాడటానికి, పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం వీ. సీ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు.