అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రి

PLD: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేటలో ఆదివారం మాజీ మంత్రి విడదల రజని ఘన నివాళులర్పించారు. కలాం చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధికి కలాం చేసిన కృషి ఎనలేనిదని ఆమె కొనియాడారు. యువతకు స్ఫూర్తినిచ్చిన నేతగా కలాం గుర్తుండిపోతారన్నారు. ఆయన ఆశయాలబాటలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.