ఎంసీఏ క్రికెట్ టోర్నీ విజేతగా బీకేఎస్: ఎమ్మెల్యే

ఎంసీఏ క్రికెట్ టోర్నీ విజేతగా బీకేఎస్: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టోర్నమెంట్‌లో బుక్కరాయసముద్రం (బీకేఎస్) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గంగావతి జట్టుపై అద్భుత ప్రతిభ కనబరిచిన విజేతలకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కప్ అందజేశారు. గెలుపు ఆనందాన్ని ఇస్తే, ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు.