మట్టి అక్రమ తవ్వకాల‌పై కఠిన చర్యలు

మట్టి అక్రమ తవ్వకాల‌పై కఠిన చర్యలు

KMM: మట్టి అక్రమ త‌వ్వకాలు జరిపితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని బోన‌క‌ల్లు తహసీల్దార్ మద్దెల రమాదేవి హెచ్చరించారు. బుధవారం చిరునోముల గ్రామం నుంచి అక్రమంగా మట్టిని ట్రాక్టర్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్లాట్లకు తరలిస్తుండ‌గా ట్రాక్టర్లను ఆర్ఐ మైథిలి అడ్డుకున్నారు. వారి వద్ద ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఆ ట్రాక్టర్లను తాహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.