'ఎస్సీ అభివృద్ధి నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి'
KMM: ప్రణాళిక ప్రకారం ఎస్సీ అభివృద్ధి నిధులు పూర్తి స్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలలో ఎస్సీ అభివృద్ధి ఫండ్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ పరిధిలో సాగు ఆధునీకరణ, ఇతర అభివృద్ధి పథకాలు ఎస్సీ రైతులకు అమలు చేయడంలో వెనుకబడి ఉన్నామని అన్నారు.