అంగన్వాడీల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

అంగన్వాడీల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

ADB: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ యూనియన్ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుతో పాటు బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు నిధులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.