మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి: CITU

మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి: CITU

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ CITU ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26,000, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.