గుడెబల్లూరులో ఉరేసుకుని యువకుడు మృతి

గుడెబల్లూరులో ఉరేసుకుని యువకుడు మృతి

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం గుడెబల్లూరులో మేకలి మహేష్ (24) అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామ శివారులోని తన పత్తి పొలంలోని గదిలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి తల్లి మేకలి తాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎస్సై నవీద్ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.