సిటీకి రాకపోకలు.. సాహసం చేయాల్సిందే
RR: ఇబ్రహీంపట్నం డిపో నుంచి సిటీకి రాకపోకలు చేయాలంటే సాహసం చేయాల్సిందేనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాచారం బస్టాండ్ నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ వెళ్లే బస్సు కిక్కిరిసిపోతుందని, సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కటంతో తాము వేలాడుతూ వెళ్లే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు అదనపు బస్సు సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.