గండి అంజన్న సేవలో మంత్రి మండిపల్లి

గండి అంజన్న సేవలో మంత్రి మండిపల్లి

KDP: గండిక్షేత్రంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో అర్చకులు, ఈవో ఆయనకు స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించే గుడి అద్భుతంగా ఉందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనంతరం దుశ్శాలువాతో మంత్రిని ఆలయ అధికారులు సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.