పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
MDCL: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రులు సతీ సమేతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు.