డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి వివరాలు వెల్లడి

కృష్ణా: గుడివాడ ట్రాఫిక్ ఎస్సై పి.నాగరాజు ఆగస్టు నెలలో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు గురువారం వెల్లడించారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మంది ముద్దాయిలను అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. జడ్జి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 1,20,000 జరిమానాను విధించారు.