ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన బాసాని ఫాతిమా తల నరాల సమస్యతో హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్యం కోసం మంజూరైన రూ.5,00,000 సీఎం సహాయ నిధిని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమె కుటుంబానికి అందజేశారు. చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించిన ఎమ్మెల్యేకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.