నాలుగు రోజులు నీటి సరఫరా నిలిపివేత

నాలుగు రోజులు నీటి సరఫరా నిలిపివేత

SKLM: ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పారిశుధ్య విభాగ పర్యవేక్షక ఇంజనీర్ పి.శంకరరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. హిరమండలం సమీపంలో ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.