యూపీ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల

KMM: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని బుధవారం ITC కోహినూర్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకొంటున్న చర్యలను మంత్రి తుమ్మల యూపీ మంత్రికి వివరించారు.