కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ: ఎమ్మెల్యే

MHBD: కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 155 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు