ప్రాథమిక పాఠశాలలో వ్యాధి నిరోధక టీకాలు

NLG: నల్గొండ మండలం ఖాజీరామారం గ్రామంలో శనివారం హెల్త్ అసిస్టెంట్ అంజయ్య ఆధ్వర్యంలో శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. వారు మాట్లాడుతూ.. శిశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని సూచించారు. వారి వెంట ఏఎన్ఎం అండాలు, ఆశా వర్కర్ పెరిక కవిత తదితరులు ఉన్నారు.