ప్రజా దర్బార్ నిర్వహించిన MP వంశీకృష్ణ
MNCL: మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ, జిల్లా ఉపాధి అధికారితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించారు.