VIDEO: మండలంలో దట్టమైన పొగ మంచు

VIDEO: మండలంలో దట్టమైన పొగ మంచు

ELR: చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఇవాళ దట్టమైన పొగ మంచు అలముకుంది. చనుబండ గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వెళ్లే ప్రధానమైన రహదారి వెంట నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. పొగ మంచు అలుముకుని ఉండడం వలన కొద్ది సంఖ్యలోనే వాహనాలు కనిపించాయి. పొగ మంచు తీవ్రమైన అనారోగ్యానికి హేతువుగా వైద్యులు తెలిపారు. మంచులో సంచరించ వద్దని వైద్యులు హెచ్చరించారు.