మరికాసేపట్లో మంత్రుల కమిటీ కీలక భేటీ

TG: బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్‌లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో AICC వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క తదితరులు పాల్గొననున్నారు.