నేడు హన్మకొండలో కేటీఆర్ పర్యటన
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హన్మకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు జరగనున్న దీక్షా దివస్‌తోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హన్మకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.