ఎడ్ల బలప్రదర్శన పోటీలకు భూమి పూజ

GNTR: తెనాలిలో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో సుల్తానాబాద్‌లోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వారం రోజులపాటు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులు తెలియజేశారు.