మారేడుగొండ సర్పంచ్‌గా గుర్రం దేవేంద్ర

మారేడుగొండ సర్పంచ్‌గా గుర్రం దేవేంద్ర

PDPL: పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గుర్రం దేవేంద్ర విజయం సాధించారు. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థి పై 50 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు. దేవేంద్ర గెలుపు ఖరారు కావడంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు, అనుచరులు సంబరాలు జరుపుకున్నారు.