విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
JGL: కోరుట్ల పరిధిలోని కల్లూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జిల్లా పోలీస్ కళాబృందం, షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ & బ్యాడ్ టచ్, POCSO చట్టం, సైబర్ మోసాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండి, వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.