పెళ్లయిన మూడు రోజులకే...!!
పెళ్లయిన మూడు రోజులకే విడాకుల కోసం ఓ మహిళ దరఖాస్తు చేసుకున్న ఘటన యూపీలో జరిగింది. తన భర్త శారీరకంగా అసమర్థుడని, ఈ విషయం ఫస్ట్ నైట్ రోజే తెలిసిందని ఆమె ఆరోపిస్తూ విడాకుల నోటీసులు పంపించింది. వైద్య నివేదికలో కూడా వరుడు 'తండ్రి కాలేడు' అని నిర్ధారణ అయినట్లు వధువు కుటుంబం పేర్కొంది. పెళ్లికి అయిన ఖర్చులు, ఇచ్చిన బహుమతులు కూడా తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.