పశువులకు ముందస్తు టీకాలు వేయించాలి

VZM: తొలకరి వర్షాల సమయంలో పశువులు గొర్రెలకు సోకే ప్రమాదకరమైన గొంతువాపు చిటిక వ్యాధి నివారణకు రైతులు ముందస్తుగానే టీకాలు వేయించాలని సోమవారం గంట్యాడలో పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్ రెడ్డి కృష్ణ సూచించారు. ఈనెల 15 నుంచి 30వరకు గొర్రెలకు చిటిక వ్యాధి నివారణకు టీకాలు ఉచితంగా వేస్తామన్నారు. మే నెలలో పశువులకు గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు వేస్తామన్నారు