ఉపాధి లేక మరో నేతన్న ఆత్మహత్య
SRCL: ఉపాధి లేక మరో నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు బలయ్యాడు. స్థానిక నెహ్రూ నగర్‌కు చెందిన నేత కార్మికుడు ఎకల్ దేవి దామోదర్(43) నేత కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చే దారిలేక మనోవేదనకు గురైన దామోదర్ మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.