ప్రశాంతంగా ముగిసిన ఏపీసెట్-2025

ప్రశాంతంగా ముగిసిన ఏపీసెట్-2025

VSP: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీసెట్-2025 ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పరీక్షలకు 82.57 శాతం హాజరు నమోదైంది. మొత్తం 30 సబ్జెక్టులకు 32,779 మంది దరఖాస్తు చేసుకోగా, 27,075 మంది పరీక్ష రాశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.