గ్రామ పంచాయతీ ట్రాక్టర్.. ప్రైవేట్ వ్యక్తుల వినియోగం
MHBD: దంతాలపల్లి మండలంలోని రేపోణి గ్రామంలో ఓ రైతు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన మామిడి తోటలో ఇనుప కంచెను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇనుప కంచెను తరలించేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను వినియోగించాడు. గ్రామ పంచాయతీ పనులకు వినియోగించాల్సిన ట్రాక్టర్‌ను సొంత పనులకు వినియోగించడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు.