భారీ బైక్ ర్యాలీ.. హోరెత్తిన సాగర్ హైవే
RR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీకి మద్దతుగా ఇబ్రహీంపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాల్ గ్రామం నుంచి సాగర్ హైవే మీదుగా జరిగిన ఈ ర్యాలీలో యువకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సంపూర్ణ తెలంగాణ వికాసమే లక్ష్యంగా కవిత రాజకీయ ప్రయాణం సాగుతుందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి పేర్కొన్నారు.