VIDEO: వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెం వద్ద వంతెన మంజూరుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రామారాయుడుపాలెం, జంపపాలెం, సోమలింగపాలెం గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మంజూరైన వంతెనకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. పనులను వెంటనే చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.