బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఇటీవల కృష్ణానదిలో మృతి చెందిన సయ్యద్ ఖాదర్ భాషా, సయ్యద్ ఖాజావలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1,50,000 చొప్పున చెక్కులను గురువారం అందజేశారు. అదే విధంగా, పెదకాకాని మండలానికి చెందిన 9 మందికి రూ.9.85 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందించారు.