VIDEO: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు'
E.G: రాజమండ్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం హెచ్చరించారు. నగరంలో విజయ్ కుమార్‌పై అనే వ్యక్తి పై జరిగిన దాడిని MLA తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. బాధితుడికి & ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు.