ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.