VIDEO: పొంగిపొర్లుతున్న వాగులు.. పర్యాటకులకు హెచ్చరిక

ASR: చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, అన్నవరం వాగులు ఉప్పొంగుతున్నాయి. చింతూరు, మోతుగూడెం, పోల్లూరు రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులకు జాగ్రత్తలు తీసుకోవాలని చింతూరు, ఎటపాక సీఐలు సూచించారు.