బావిలో దూకిన యువకుడిని కాపాడిన ఎస్సై
NLR: కందుకూరులో శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని టౌన్ ఎస్సై శివ నాగేశ్వరరావు కాపాడారు. అంకమ్మ బావిలో దూకిన యువకుడిని స్థానికులు గుర్తించారు. అదే సమయంలో అటువైపు నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సైకి సమాచారం తెలిసింది. వెంటనే ఆయన చాకచక్యంగా యువకుడిని కాపాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.