48 గంటల్లో 1000 మంది అరెస్ట్

48 గంటల్లో 1000 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించారు ఢిల్లీ పోలీసులు. 'ఆపరేషన్ సైహాక్ 2.0' పేరుతో భారీ వేట మొదలుపెట్టారు. కేవలం 48 గంటల్లోనే ఏకంగా 1000 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేసి రికార్డు సృష్టించారు. ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ మెరుపు దాడులు జరిగాయి. ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని పట్టుకోవడం ఇదే తొలిసారి.