చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి

చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి

BPT: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న కర్లపాలెం(M)లోని లంక కాలువ కట్టలో చోటు చేసుకుంది. అద్దూరి వెంకటరావు(50) అనే వ్యక్తి చేపలు పట్టేందుకు గుడిపూడి వంతెన సమీపంలోని తుంగభద్ర కాలువలో వల పెట్టాడు. వలలో ఉన్న చేపలు తీస్తుండగా వల అతనికి చుట్టుకుని నీళ్లలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.