డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ర్యాలీ
HYD: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ మత్తులో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకుని దేశం బాగు కోసం కృషి చెయ్యాలని ఆయన కోరారు.