చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు

చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు

SKLM: ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో చక్ర తీర్థ స్నానాలు నిర్వహించారు.