ప్రజలకు GOOD NEWS.. రూ.1 కోటితో నాలా వంతెన
MDCL: చిల్కానగర్ డివిజన్ అజ్మత్ నగర్ కాలనీలో ఇరిగేషన్ నాలాపై రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వంతెన నిర్మాణం వేగంగా సాగుతోందని, ట్రంక్ లైన్ పనులకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ రహదారిగా ఉపయోగపడేలా ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు.