వెలగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న మంత్రి
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బయలుదేరారు. శ్రీశైలం సమీపంలోని కొల్లం వాగు నుంచి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. నిర్మాణ వేగం, నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిపై అధికారులు వివరాలు అందించనున్నారు.