హరీష్ రావు తండ్రికి BRS నేతల నివాళి
GDWL: మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య సంఘం రాష్ట్ర నాయకులతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.