రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు మృతి
GNTR: రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని సాయిబాబా గుడి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి లారీ ఓ వృద్ధురాలిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు