'తల్లికి వందనం' పెండింగ్ నిధుల కోసం చివరి అవకాశం.!

'తల్లికి వందనం' పెండింగ్ నిధుల కోసం చివరి అవకాశం.!

KRNL: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా సాంకేతిక లోపంతో నిధులు అందని తల్లులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తొలి విడతలో డబ్బులు అందని వారు తమ బ్యాంక్ ఖాతా వివరాలను ఈనెల 13 లోపు అప్‌డేట్ చేసుకోవాలి. అలాగే, డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్, NPCI లింకింగ్‌తో అనుసంధానం అయి ఉండాలి.