అప్పుడే నా జీవితం మారిపోయింది: ఐశ్వర్య రాయ్
నటి ఐశ్వర్య రాయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సౌదీ అరేబీయాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1994లో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం, ఆ కిరీటం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని తెలిపింది. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాతే సినీ రంగంలోకి ప్రవేశించే అవకాశాలు వచ్చాయని వెల్లడించింది.