అగ్ని ప్రమాద బాధితులకు అండగా జనసేన
KKD: గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సోమవారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రెడ్ క్రాస్ తరఫున దుప్పట్లు, పార్టీ తరఫున నిత్యవసర సామాగ్రి అందజేశారు.