'మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు చేయాలి'
ASR: మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం డిమాండ్ చేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భాగంగా కండ్రుంలో ప్రజలతో శనివారం సంతకాలు చేపట్టారు. అనంతరం పరశురాం మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రజాహితానికి విరుద్ధమని విమర్శించారు.