నేటి నుంచి ఉలవలు పంపిణీ
అన్నమయ్య: సంబేపల్లి మండల వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్ద గురువారం నుంచి ఉలవలు పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కిషోర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబేపల్లి మండలానికి 250 క్వింటాళ్ల ఉలవలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం పది కిలోల ప్యాకెట్ ధర రూ. 560 అని 80 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.