పిల్లల కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలి: ఎస్పీ
SRCL: వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈత రాని వారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్ల వద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.